ఖమైనీ మృతికి భారత్‌ సంతాపం

March 05, 2026
img

ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్‌ అధ్యక్షుడు అలీ ఖమైనీతో సహా కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ కమాండర్లు చనిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌-ఇరాన్‌ మద్య చిరకాలంగా మంచి స్నేహ సంబంధాలున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో తలనొప్పులు, అమెరికాతో చాలా అవసరాలు కూడా ఉన్నాయి. కనుక ఇరాన్‌ అధ్యక్షుడు అలీ ఖమైనీ మృతి పట్ల వెంటనే సంతాపం తెలపలేదు.

మూడు రోజులు తర్వాత నేడు భారత్‌ విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి ఇరాన్‌ రాయబారిని కలిసి అలీ ఖమైనీ మృతి పట్ల భారత్‌ తరపున సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌-ఇరాన్‌ మద్య స్నేహ సంబంధాలు గురించి, ఇరాన్‌ ప్రస్తుత పరిస్థితి గురించి కాసేపు మాట్లాడుకున్నట్లు సమాచారం. కాస్త ఆలస్యంగానైన అలీ ఖమైనీ మృతి పట్ల భారత్‌ సంతాపం తెలపడం మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు.

Related Post