తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భర్త, కుమారుడు, జాగృతి సభ్యులతో కలిసి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల చేరుకొని నేడు శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నాలుగేళ్ళుగా నేను, నా కుటుంబ సభ్యులు, జాగృతి సభ్యులు ఈ కేసు వలన మనోవేదన అనుభవిస్తున్నాము. న్యాయం ధర్మం నావైపున్నందున స్వామివారి ఆశీసులతో ఈ కేసులో నాకు “కంప్లీటుగా క్లీన్ చిట్’ లభించింది. నా కష్టాలు తీర్చినందుకు మొక్కు తీర్చుకున్నాము. మరో రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నా. దానికీ స్వామీ వారి ఆశీసులు లభించాలని కోరుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నాను,” అని అన్నారు.
ఆమె నిన్న తిరుపతి అలిపిరి వద్దకు చేరుకున్నప్పటి నుంచి ‘కేసు నుంచి విముక్తి లభించింది... కొత్త పార్టీ పెడుతున్నానంటూ ఇవే మాటలు చెప్తున్నారు. దిగువ కోర్టు కేసు కొట్టేస్తేనే ఆమె “ఈ కేసులో నాకు కంప్లీటుగా క్లీన్ చిట్’ లభించింది.. విముక్తి లభించిందని” ఇంత నమ్మకంగా చెప్పుకోవడం గమనిస్తే, నిజంగానే ఇక్కడితో ఈ కేసు అటకెక్కిపోయి ఉండవచ్చు.
సీబీఐకి ఈ కేసులో నిబద్దత లేదని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. కనుక ఈ తీర్పుని సీబీఐ హైకోర్టులో సవాలు చేసినప్పటికీ అది మీడియాను తద్వారా ప్రజలను మభ్యపెట్టడానికే అని అనుమానించక తప్పదు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు pic.twitter.com/Ht0LK5amoB
— Telangana Jagruthi (@TJagruthi) March 6, 2026