భట్టి విక్రమార్క కుమారుడి పెళ్ళికి కేటీఆర్‌, హరీష్‌, ఏపీ మంత్రులు!

March 05, 2026


img

నేడు తెలంగాణ డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షిల వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ వేడుకలకు కాంగ్రెస్‌ బద్ధశత్రులైన బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీష్‌ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురు బిజేపి నేతలు కూడా హాజరయ్యారు. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులలో చిరంజీవి, ప్రకాష్ రాజ్, గోపీ చంద్, నిర్మాత దిల్ రాజు,  తదితరులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

నిత్యం పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటే కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఈ వేడుకలో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు.


Related Post