తిరుమలలో కల్వకుంట్ల కవిత!

March 05, 2026


img

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు తిరుపతి చేరుకొని కాలి నడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడుతూ, “ఓ తప్పుడు కేసుతో నాలుగేళ్ళు మనోవేదన అనుభవించాను. కానీ న్యాయం, ధర్మం నావైపు ఉన్నందున, దేవుడి దయతో ఈ కేసు నుంచి బయట పడ్డాను.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారంటే నాకు చాలా భక్తి. నన్ను ఈ కేసు నుంచి బయటపడేసినందుకు కాలి నడకన వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకునేందుకు నేను, నా కుటుంబ సభ్యులు, జాగృతి సభ్యులు వచ్చాము. నేను పెట్టబోయే కొత్త పార్టీకి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు. 

ఆమె మీడియాతో మాట్లాడే ముందు జై ఆంద్రా అని నినాదం చేసి ముగింపులో జై తెలంగాణ అని నినాదం చేశారు. 



Related Post