భారత్ వాయుసేనకు గర్వకారణంగా నిలుస్తున్న సుఖోయ్ యుద్ధ విమనాలే, పైలట్లకు శవ పెటికలుగా మారుతుండటం చాలా బాధాకరమే. ఏటా ఒకటో రెండో యుద్ద విమానాలు కూలుతూనే ఉంటాయి. అదృష్టవంతులైన కొందరు పైలట్లు ప్రాణాలతో బయటపడితే మరికొందరు దుర్మరణం పాలవుతుంటారు.
తాజాగా గురువారం సాయంత్రం అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయింది. జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. వాయుసేన సిబ్బంది వెంటనే గాలింపు చేపట్టగా విమానాశ్రయానికి 60 కిమీ దూరంలో కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్ మరణించారు. ఈ ప్రమాదం పై వాయుసేనలో సంబంధిత అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.