బ్యాండ్ మేళంలో బ్రేకప్ సాంగ్!

March 06, 2026


img

హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా చేస్తున్న ‘బ్యాండ్ మేళం’ సినిమా ఇప్పటికే టీజర్‌, పాటలతో మోత మోగించింది. నేడు రాజమ్మ విడిసిపెట్టి పోయిందో అంటూ సాగే బ్రేకప్ సాంగ్’ విడుదల చేశారు.

చిన్న చిన్న పదాలతో చంద్రబోస్ వ్రాసిన ఈ పాటని విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, రామ్‌ మిరియాల ఆలపించారు. ఈ పాటకు సునీల్ సున్నపు, ఫాల్గుని బంగేరా డాన్స్ కంపోజిషన్ చేశారు. హర్ష్ రోషన్ బృందం అంతే చక్కగా డాన్స్ చేసింది.   

ఈ సినిమాకి కధ, ఎడిటింగ్,  స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 13న విడుదల కాబోతోంది.          


Related Post

సినిమా స‌మీక్ష