పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “13 సం.లు లోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని కొన్ని సూచనలు వచ్చాయి. టీనేజ్ పిల్లలపై సోషల్ మీడియా దుశ్రప్రభావం చాలా ఉంటోంది. కనుక అయితే 13 సం.లకే పరిమితం చేయాలా లేక 16 సం.ల వరకు ఈ నిషేధం వర్తింపజేయాలా? అని మేధావుల అభిప్రాయలు తీసుకొని 90 రోజులలోగా దీనిని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాము,” అని అన్నారు.
ఒకప్పుడు చిన్నపిల్లలు సాటి పిల్లాలతో కలిసి ఆటలాడుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తల్లితండ్రులు కూడా ఇంటి పని, ఆఫీసు పని ఒత్తిడిలో ఉంటున్నారు. కనుక 3-4 ఏళ్ళు వయసులోపున్న పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వాటితోనే ఆడుకుంటున్నారు.
అలా మొదలైన సెల్ ఫోన్ ఆటలు 10-12 ఏళ్ళు వయసు వచ్చేసరికి వ్యసనంగా మారిపోతుంది. అదే 14-16 ఏళ్ళు వయసు వచ్చేసరికి మొబైల్ ఫోన్ లేకపోతే బ్రతకలేమనే పరిస్థితికి వచ్చేస్తున్నారు.
పిల్లలు మొబైల్ ఫోన్లకు ఇంతగా అడిక్ట్ అయిపోయిన ఈ తరుణంలో ఉచిత వైఫీ, ఇంటర్నెట్, వాటితో పాటు సోషల్ మీడియా కూడా అందుబాటులోకి వచ్చేసింది.
రాన్రాను ఎఐ వంటి కొత్త టెక్నాలజీ, దాంతో పాటు నెట్ స్పీడ్ కూడా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితులో టీనేజ్ పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయడం సాధ్యమేనా? చేస్తే ఎలా? 90 రోజులలో తెలుస్తుంది.
బ్రేకింగ్ న్యూస్
ఏపీలో 13 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి సోషల్ మీడియా బ్యాన్
అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
90 రోజుల్లో దీన్ని అమలు చేస్తామని ప్రకటన
16 ఏళ్ల లోపు ఉన్నవారిపై కూడా నిషేధం ఉండాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాము – చంద్రబాబు నాయుడు pic.twitter.com/lLuDwPAYll