సూపర్ హిట్ సినిమా ‘శతమానం భవతి’ తర్వాత శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ మళ్ళీ ‘భోగీ’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా భోగీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వా పాత్ర పేరు ‘గంగ’ అని పరిచయం చేస్తూ వేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో చాలా రఫ్ అండ్ టఫ్‌గా చూపారు. ఈ సినిమాలో డింపుల్ హాయతి కూడా మరో హిరోయిన్‌గా నటిస్తున్నారు.
‘భోగి’ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె చేస్తున్నారు.
1960లో ‘అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాలు’ కధాంశంగా తీసుకొని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 28న విడుదల కాబోతోంది.