కోలీవుడ్‌లో మరో విడాకులు, మరో పెళ్ళి!

March 07, 2026
img

తెలుగు సినీ పరిశ్రమలో మొదటి భార్యకు విడాకులు-రెండో పెళ్ళిళ్ళ మొదటి సీజన్ ముగిసి చాలా కాలమే అయ్యింది. నాగ చైతన్య-సమంతల విడాకులతో రెండో సీజన్ మొదలైంది. తర్వాత ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుని ఇటీవల పెళ్ళి చేసుకున్నారు.     

కోలీవుడ్‌లో రెండో సీజన్ మొదలై చాలా కాలమే అయ్యింది. ఇటీవల టీవీకే పార్టీతో తమిళనాడు రాజకీయాలలోకి ప్రవేశించిన విజయ్ దళపతికి భార్య సంగీత ఇటీవలే డైవోర్స్ నోటీస్ పంపింది. దానికి అయన కూడా రెడీగానే ఉన్నట్లున్నారు. డైవోర్స్ నోటీస్ అందుకోగానే బహిరంగంగా నటి త్రిషతో కలిసి ఇటీవల ఓ నిర్మాత కొడుకు పెళ్ళికి హాజరయ్యారు. కనుక భార్యతో విడాకులు తీసుకోవడం, త్రిషని రెండో పెళ్ళి చేసుకోవడం రెండూ ఖాయంగానే కనిపిస్తున్నాయి.  

మరో నటుడు తరుణ్ భాస్కర్ తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న కాస్ట్యూమ్ డిజైనర్ లతా నాయుడుతో విడిపోయి నటి ఈషా రెబ్బాతో ప్రేమాయణం సాగిస్తున్నారు. డైవోర్స్ రాగానే ఆమెను పెళ్ళి చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 


Related Post