సిఎం రేవంత్‌ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టులు

March 07, 2026


img

తెలంగాణ రాష్ట్రంలో నేడు ఓ అనూహ్య పరిణామం జరుగబోతోంది. మావోయిస్ట్ లీడర్ దేవ్ జీ అధ్వర్యంలో పనిచేసే పీఎల్‌జీఎ కమిటీలోని 124 మంది మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో వారు పోలీసులకు ఆయుధాలు అప్పగించి లొంగిపోతారు.

ఇప్పటికే వారు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులలో అక్కడకు చేరుకొని ఆయుధాలు అప్పగించారు. సిఎం రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత లొంగిపోయినట్లు లాంచనంగా ప్రకటిస్తారు. తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి వారి సమక్షంలోనే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మరికొద్ది మంది మావోయిస్టులున్నట్లు సమాచారం. బహుశః వారు కూడా త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఇకపై అడవులలో మావోయిస్టులు-పోలీసులకు మద్య ఎదురుకాల్పులు, ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకుల హత్యలు ఆగిపోతాయి. 


Related Post