పాన్ ఇండియా మూవీగా వచ్చిన దురంధర్ సూపర్ డూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా దురంధర్-ది రివెంజ్ ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ కోసం సినీ పరిశ్రమ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు ట్రైలర్ విడుదలైంది. ‘దురంధర్-ది రివెంజ్’ పేరులోనే సినిమా ఏవిధంగా ఉండబోతోందో చెప్పేశారు కనుక ట్రైలర్ కూడా అలాగే చాలా భీభత్సంగా ఉంది.
ఈ సినిమాలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్ సింగ్, ఆర్.మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, రాకేశ్ బేడీ, డానిష్ పండోర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం: ఆదిత్య ధర్, సంగీతం: శాశ్వత్ సచ్ దేవ్, కెమెరా: వికాష్ నౌలఖ, స్టంట్స్: అయేజ్ గులాబ్, సీ యాంగ్ వో, యానిక్ బెన్, రంజాన్ బులుత్, ఎడిటింగ్: శివకుమార్ వి పానికర్ చేశారు.
ఈ సినిమాని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ కలిసి నిర్మించాయి. తెలుగుతో సహా పలు భాషల్లో ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.