బీసీల కోసం పోరాడినా తప్పేనా? కల్వకుంట్ల కవిత

March 08, 2026


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజా ఇంటర్వ్యూలో బీసీ రిజర్వేషన్స్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “బీసీల కోసం నేను కొత్తగా పోరాటం మొదలుపెట్టలేదు. మొదటి నుంచి నేను బీసీల సంక్షేమం, రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ వెలమ సామాజిక వర్గానికి చెందిన నేను, బీసీల గురించి మాట్లాడటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో వెలమలు బీసీలు కాగా మహారాష్ట్రలో ఎస్సీలు. కనుక ఆ సామాజిక వర్గాలకు చెందిన దానిగా నేను బీసీల కోసం పోరాడితే తప్పేముంది? బీసీల సంక్షేమం, బీసీ రిజర్వేషన్స్ ఒక్కటే కాదు మాకు ఇంకా చాలా అంశాలున్నాయి. వాటిలో ఇదీ ఒకటి,” అని అన్నారు.

అయితే బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలు, ఇలాంటి సమస్యలపై సిఎంగా ఉన్న తండ్రి కేసీఆర్‌ని నిలదీయని కల్వకుంట్ల కవిత ఇప్పుడు కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలను విమర్శిస్తున్నారు. 

“కేసీఆర్‌, రేవంత్ రెడ్డి ఇద్దరూ ప్రజలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోయారు. నన్ను నమ్మి అధికారం కట్టబెట్టండి,” అని కల్వకుంట్ల కవిత చెపితే ప్రజలు నమ్ముతారా? ఆమె కూడా తండ్రిలాగే వ్యవహరించరని గ్యారెంటీ ఏమిటి? ఎన్నికల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీతో కలిసిపోరని నమ్మకం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన జవాబులు చెప్పాల్సి ఉంటుంది.      


Related Post