తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడని ఈ రోజుల్లో అచ్చమైన తెలుగు పేరు అదీ.. ‘గాయపడ్డ సింహం’ వంటి పాత పేరు పెట్టుకోవడం నిజంగా సాహసమనే చెప్పాలి.
కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా చేసిన సినిమా తెలుగులో ‘గాయపడ్డ సింహం’గా విడుదలవుతోంది. ఈ సినిమా థీం సాంగ్ లాంచింగ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, సూపర్ హిట్ సినిమా ‘ఈ నగరానికి ఏమయింది?’కి ఈ ఏడాది అక్టోబరులోగానే మీ ముందుకు తెస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
‘గాయపడ్డ సింహం’ సినిమాలో మానస చౌదరీ, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్, సంగీతం: స్వీకార్ ఆగస్తి, కెమెరా: విద్యాసాగర్ చింత, ఎడిటింగ్: విప్లవ న్యాషదం చేశారు.
సప్త ఆశ్వ మీడియా వర్క్స్, జీ స్టూడియోస్, పిఓవి స్టోరీస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ బంస్వాల్ కలిసి ‘గాయపడ్డ సింహం’ నిర్మించారు. త్వరలోనే విడుదల కాబోతోంది.