రాజాసాబ్: 'సహనా సహనా' ప్రమో సాంగ్

December 14, 2025


img

మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో ‘రాజాసాబ్’ జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున 'సహనా సహనా' అంటూ పాట ప్రమోతో ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు.

ఈ పాటని దర్శకుడు మారుతి వ్రాయడం విశేషం. ఈ పాటకు తమన్ చక్కటి సంగీతం అందించారు. పూర్తిపాట ఈ నెల 17 సాయంత్రం 6.35 గంటలకు విడుదలవుతుంది.

ఈ పాటలో ప్రభాస్‌ చాలా స్టయిలిష్‌గా కనిపించారు. ఇలాంటి పాట అందరూ పాడుకునేలా క్యాచీగా ఉండాలి. కానీ లిరిక్స్ చాలా హెవీగా ఉన్మానాయి. అవునో కాదో ఎవరికీ వారు తెలుసుకుంటేనే బాగుంటుంది. 

ఈ నెల 27న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. కానీ ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. 

 ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు. 

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష