మీడియా పోరాటాలలో మమ్మల్ని నిందించొద్దు: సిఎం రేవంత్

January 18, 2026


img

మొన్న ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులపై నేడు ఏబీఎన్ మీడియాలో వచ్చిన కధనంపై సిఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ, “నేను అధికారంలో ఉన్నంత వరకు సింగరేణిలో అవినీతి జరిగేందుకు ఆస్కారం లేదు. రాష్ట్రంలో మీడియా చానల్స్ మద్య జరుగుతున్న పోరాటాలలో మా ప్రభుత్వాన్ని ఇరికించవద్దు. నిందించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అవి గొడవలు పడుతూ నా మంత్రులపై ఆరోపణలు చేస్తే సహించను. ఒకవేళ వారిపై పిర్యాదులు ఉంటే నేరుగా నా వద్దకు వచ్చి చెప్పండి. అంతేకానీ మా గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్రాస్తామంటే సహించబోము. 

మాజీ సిఎం కేసీఆర్‌ రాక్షస గురువు శుక్రాచార్యుడులా ఫామ్‌హౌసులో కూర్చొని తన రాక్షసులు మారీచ సుభాహువులను మా ప్రభుత్వంపైకి, రాష్ట్రంపైకి వదిలారు. ప్రస్తుతం వారు ఖమ్మంలోనే తిరుగుతూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.


Related Post