కోలీవుడ్ నటుడు ధనుష్ విలక్షణమైన పాత్రలు, కధలతో సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంటారు. ధనుష్, కృతి సనన్ జంటగా చేసిన అమర కావ్యం కూడా అటువంటిదే. గత ఏడాది నవంబర్ 28న ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆనంద్ దర్శకత్వంలో ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వంలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతోంది. జనవరి 23 నుంచి తెలుగుతో సహా 5 భాషల్లో ఒకేసారి రాబోతోంది.
ఈ సినిమాలో ధనుష్, కృతీ సనన్ కాలేజీ విద్యార్ధులుగా ఉన్నప్పుడు ప్రేమలో పడతారు. కానీ ధనుష్‌కి కోపం, ఆవేశం చాలా ఎక్కువ. కనుక తరచూ ఎవరో ఒకరితో గొడవ పడుతుంటాడు. ఆ కారణంగా వారిరువురూ దూరమవుతారు. తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కధ. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది కనుక ఓటీటీలోకి ప్రేక్షకులు కూడా అమర కావ్యం చూసి ఆనందించవచ్చు.