రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసు, నోటీసు అంతా రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే. ఆయన ప్రభుత్వ హామీలు, వైఫల్యాల గురించి మేము నిలదీస్తుండటంతో ప్రజల దృష్టి మళ్ళించేందుకు నాకు నోటీసు పంపారని భావిస్తున్నాను.
ఇదో సిల్లీ డ్రామా. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడను. మన వ్యవస్థలు, చట్టాలపై నాకు చాలా గౌరవం ఉంది కనుకనే విచారణకు హాజరవుతున్నాను. సిట్ అధికారుల ప్రశ్నలకు జవాబులు చెపుతాను. సమాధానం చెపుతాను. నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతాను,” అని హరీష్ రావు అన్నారు.
అయితే ఈ కేసులో వేరెవరి గురించో మాట్సంలాడుకోవడం అనవసరం. సాక్షాత్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఆమె భర్త ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని ఆమె స్వయంగా చెప్పారు కదా? కనుక ఈ కేసులో ఆమెని కూడా సాక్షిగా పిలిచి అడిగకుండా ఉంటారా? అడిగితే ఆమె ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పకుండా ఉంటారా? మరిది సిల్లీ డ్రామాయేనా?