మన తెలుగు సాంప్రదాయం ప్రకారం వధూవరులు ముహూర్తం సమయానికి ఒకరి నెత్తిపై మరొకరు జీలకర్ర-బెల్లం పెట్టుకుంటారు. అంటే పెళ్ళి జరిగిపోయినట్లే. ఆ తర్వాత వధువు మెడలో వరుడు మూడు ముళ్ళు వేస్తాడు. దాంతో వారి జీవితాలు ముడిపడిపోతాయి.
ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో పెళ్ళి జరుగుతోంది. వధూవరులు జీలకర్ర-బెల్లం పెట్టుకున్న తర్వాత మండపం వద్దకు ఓ యువకుడు వచ్చాడు. అతను మరెవరో కాదు ఆమె ప్రేమికుడు. అతనిని చూసి వధువు టక్కున లేచి నిలబడి ఈ పెళ్ళి నాకిష్టం లేదని చెప్పింది. దాంతో అక్కడ రచ్చరచ్చ జరిగింది.
జీలకర్ర-బెల్లం పెట్టుకున్న తర్వాత పెళ్ళి వద్దనుకుంటే ఎలా అని? ఇరువురి తల్లి తండ్రులు, బంధువులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె ప్రేమికుడుపై దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు అక్కడకు చేరుకొని వారి గొడవను ఆపగలిగారు. కానీ వధువు ఒప్పుకోకపోవడంతో పెళ్ళి మాత్రం చేయలేకపోయారు.