గాంధీ విగ్రహానికి 5,000 కోట్లని ఎవరు చెప్పారు? సిఎం ప్రశ్న

March 08, 2026

img

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా భవన్‌లో జర్నలిస్టులతో సహా వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలతో సిఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మూసీ ప్రాజెక్టులో భాగంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేసి గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటూ రోజూ వార్తలు వస్తున్నాయి. అంత ఖర్చు పెడుతున్నామని ఎవరైనా చెప్పారా?

బుద్దున్నవాడు ఎవడైనా విగ్రహానికి అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తాడా? గాంధీజీ విగ్రహంతో సహా అక్కడ విజ్ఞాన్ భవన్‌ వగైరా ఏర్పాటు చేసేందుకు ఓ 150-200 కోట్లు మాత్రమే ఖర్చుచేయబోతున్నాము. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా చిలువలు పలువలు అల్లేస్తూ గాంధీజీ విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని పుకార్లు వ్యాపింపజేస్తున్నారు,” అని అన్నారు.

గత ప్రభుత్వ పాలనకు తన పాలనకు తేడా వివరిస్తూ, “గతంలో ఎంతమంది ఇలా ఈ ప్రజా భవన్‌లోకి రాగలిగారు? అని ప్రశ్నిస్తే ఓ నలుగురైదుగురు మహిళా జర్నలిస్టులు చేతులెత్తారు. కానీ నేడు వంద మందికి పైగా ఈ సమావేశానికి వచ్చారు. దొరల గడీ పాలనకు మా ప్రజా పాలనకు ఇదే తేడా.

ఇది ఈరోజు మొదలుపెట్టలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే ప్రారంభించాము. సామాన్య ప్రజలకు సైతం ఈ ప్రజా భవన్‌ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. జర్నలిస్టులకు మరీ ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

"మూసీ నది ఒడ్డున రూ.5000 కోట్లతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

బుర్ర ఉన్న ఎవరైనా విగ్రహం కోసం 5వేల కోట్లు ఖర్చు చేస్తారా?"

- సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/5xrJkrUVxj
— Telugu360 (@Telugu360) March 8, 2026

(Video Courtecy: Telugu 360)

Related Post