బెల్లంకొండ శ్రీనివాస్‌-కావ్యా రెడ్డి... వివాహ నిశ్చితార్ధం

March 08, 2026
img

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌-కావ్యా రెడ్డిల వివాహ నిశ్చితార్ధం నేడు హైదరాబాద్‌లో జరిగింది. సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు బోయపాటి శీను, నటి సంయుక్త ఈ వేడుకకు హాజరయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్‌-కావ్యా రెడ్డి కుటుంబాలకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆవిధంగా వీరిద్దరి మద్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెద్దల ఆమోదంతో పెళ్ళి చేసుకోబోతున్నారు. కావ్యారెడ్డి న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాతగారు న్యాయమూర్తిగా చేయగా తండ్రి హైదరాబాద్‌లోనే న్యాయవాదిగా చేస్తున్నారు. త్వరలోనే వీరు పెళ్ళి పీటలు ఎక్కనున్నారు.   


Related Post