నెట్‌ఫ్లిక్స్‌లోకి విశ్వక్‌ సేన్‌ ఫంకీ ఎప్పటి నుంచంటే...

March 08, 2026


img

‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌, కాయడు లోహార్ జంటగా చేసిన ‘ఫంకీ’ గత నెల థియేటర్లలో విడుదలై అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. 

క్లుప్తంగా కధ: ఓ కొత్త సినీ దర్శకుడు కోమల్ (విశ్వక్‌ సేన్‌) జస్ట్ రూ.4 కోట్లతో సినిమా పూర్తి చేస్తానని చెప్పి ‘మంచి ప్రొడక్షన్స్’ నిర్మాత నరేష్ చేత సినిమా మొదలుపెడతాడు. బడ్జెట్‌ రూ.40 కోట్లు అవుతుంది కానీ సినిమా పూర్తి కాకపోవడంతో మంచి నిర్మాతకు గుండె పోటు వచ్చి హాస్పిటలలో చేరుతాడు. ఆయన కూతురు చిత్ర (కాయడు లోహార్) ఎట్టి పరిస్థితిలో ఆ సినిమా పూర్తి చేస్తానని తండ్రికి మాట ఇచ్చి బాధ్యత తీసుకుంటుంది. ఆ తర్వాత వారిద్దరి మద్య రొమాన్స్ ... సినిమా పూర్తయిందా లేదా? ఓటీటీలో చూడాల్సిందే. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్  సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

 శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఫంకీ నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష