ఈసారి మహిళల అధ్వర్యంలో మేడారం జాతర

January 18, 2026
img

ఈ నెల 28 నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర మొదలవుతుంది. మంత్రి సీతక్క సూచన మేరకు ఈసారి మేడారం మహా జాతర పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిగా మహిళలకే ప్రభుత్వం అప్పగించింది. దీని కోసం మొత్తం 14 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. ఒక్క ఎక్స్‌ప్రెస్‌ అఫీషియో తప్ప మిగిలిన 13 మంది గిరిజన మహిళలే. ఈ మహా జాతర పనులు చిత్తశుద్దితో నిర్వహిస్తామని సభ్యుల చేత నేడు మంత్రి సీతక్క ప్రమాణం చేయించారు. దేవాదాయశాఖ జారీ చేసిన జీవోలో పేర్కొన్న ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు: 

1. శ్రీమతి ఎర్ప సుకన్య

2. శ్రీమతి గికురు భాగ్య

3. శ్రీమతి మైపతి రచన

4. శ్రీమతి సోదిరెడ్డి జయమ్మ  

5. శ్రీమతి పాయం రమణ 

6. శ్రీమతి పులుసం పుష్పలత

7. శ్రీమతి గుంటోజు పావని  

8. శ్రీమతి పోడెం రాణి 

9. శ్రీమతి ఇజ్జిగిరి మమత 

10. శ్రీమతి భూక్యా వసంత 

11. శ్రీమంటి గంటమూరి భాగ్యలక్ష్మి 

12. శ్రీమతి జనగం గంగా లక్ష్మీ

13. శ్రీమతి చింత చంద్రావతి

14. శ్రీ సిద్దబోయిన జగ్గారావు (ఎక్స్‌ప్రెస్‌ అఫీషియో). 

Related Post