ఇంతకీ హరీష్‌ బాధితుడా, భాగాస్వామా? అద్దంకి ప్రశ్న

January 20, 2026


img

మాజీ మంత్రి హరీష్‌ రావు ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మంగళవారం ఉదయం సుమారు 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సిట్ కార్యాలయంలోకి వెళ్ళారు. సాయంత్రం 4.30 గంటలయినా ఇంకా బయటకు రాలేదు. దాదాపు 5 గంటలుగా సిట్ అధికారులు ఆయనని ప్రశ్నిస్తూనే ఉండటంతో బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. 

హరీష్‌ రావు ఈరోజు విచారణకు హాజరయ్యే ముందుకు “ఇదో సిల్లీ డ్రామా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఆడుతున్న కొత్త డ్రామా,” అని ఎద్దేవా చేశారు. 

ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, “ఈ కేసు విచారణ ఈరోజు కొత్తగా మొదలుపెట్టలేదు. రెండేళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. మరి అలాంటప్పుడు దీనికీ మున్సిపల్ ఎన్నికలతో ఏం సంబంధం?

మీరు ఏ తప్పు చేయలేదన్నారు. మరి అటువంటప్పుడు ధైర్యంగా విచారణకు హాజరవ్వాలి కానీ ఈ స్టోరీలెందుకు? ఇంతకీ ఈ కేసులో మీరు బాధితులా లేక భాగస్వామా? ఒకవేళ బాదితులైతే మీ ఫోన్ ఏవిధంగా ట్యాపింగ్ చేయబడిందో చెప్పండి. ఒకవేళ భాగస్వాములైతే సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పండి.

అయినా ఇంటల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయించిన ఘనుడు మా నాన్న కేసీఆర్‌ అంటూ కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు కదా? ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు మీకు. కానీ సిఎం రేవంత్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతారా?” అంటూ ఘాటుగా స్పందించారు.


Related Post