మున్సిపల్ బరిలో తెలంగాణ జాగృతి?

January 20, 2026


img

త్వరలో తెలంగాణ జాగృతి మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. కల్వకుంట్ల కవిత అధ్యక్షతన నడుస్తున్న తెలంగాణ జాగృతి తొలిసారిగా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. అయితే తొలి ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత తనకు బాగా పట్టున్న నిజామాబాద్‌లో మాత్రమే 20 మంది అభ్యర్ధులను బరిలో దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశవాహులతో చర్చలు జరిపి కొందరి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అయితే తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ కాదు. కొత్త పార్టీ ప్రకటన, రిజిస్ట్రేషన్ జరుగలేదు. కనుక అందరినీ స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దించాలని కల్వకుంట్ల కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ఆమె తన అభ్యర్ధులను బరిలో దించితే... 1. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల ఓట్లు చీలిపోతాయి. 2. ఈ ఎన్నికలలో ఆమె అభ్యర్ధులు గెలిస్తే ఆమెకు ప్రజాధరణ సానుభూతి ఉందని స్పష్టమవుతుంది. 3. ఒకవేళ ఓడిపోతే ఈ రెండో ఇన్నింగులో ఇది తొలి దెబ్బ అవుతుంది. 4. గెలిస్తే కొత్త పార్టీ ఏర్పాటు వేగావంతం చేయవచ్చు. 5. ఓడితే కొత్త పార్టీ పునరాలోచన చేయక తప్పదు. 

నిజామాబాద్‌ మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ జాగృతి పోటీపై ఆమె ఇంకా ద్రువీకరించాల్సి ఉంది.


Related Post