మారుతి-ప్రభాస్‌ల ‘రాజాసాబ్’తో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. వారికి ఉపశమనం కలిగించేందుకా అన్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే అది ఈ ఏడాదిలో రాదు. వచ్చే ఏడాది మర్చి 5న విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి దిమ్రీ నటిస్తున్నారు. ఇటీవలే వారి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా అది చాలా వైరల్ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబిరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ; సంగీతం: హర్ష వర్ధన్ రామేశ్వర్; కెమెరా: రాజ్ తోట; యాక్షన్: సుప్రీమ్ సుందర్; ఆర్ట్: ఘార్గి ముఖర్జీ చేస్తున్నారు.
గుల్షన్ కుమార్ & టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, ప్రభాకర్ రెడ్డి వంగ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషలతో భాషల్లో నిర్మిస్తున్నారు. జపనీస్, కొరియన్ భాషలలో డబ్ చేసి 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.