అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాల నడుమ జనవరి 12న విడుదలైంది. అనిల్ రావిపూడి హామీ ఇచ్చినట్లుగానే హాయిగా నవ్వుకునేలా సినిమా ఉండటంతో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతి పండగ హడావుడి కూడా పూర్తయిపోయింది. కనుక ఈ ఆరు రోజుల కలెక్షన్స్ ఏవిధంగా ఉన్నాయో లెక్కలు చూసుకోవాల్సిన సమయం ఇదే.
సినిమా రిలీజ్ అయిన 5వ రోజుకి ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ.226 కాగా 6వ రోజున మరో రూ.35 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 261 గ్రాస్ సాధించింది. పండగ హడావుడి ముగిసిపోయింది. నేడు ఆదివారం కనుకకలెక్షన్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కానీ మిగిలిన మూడు వారాలలో సగటున రోజుకి రూ.15 కోట్లు
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.