ప్రశాంత్ కిషోర్‌తో కల్వకుంట్ల కవిత భేటీ?

January 20, 2026


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జనం బాట’ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీ పెడతానని సూచన ప్రాయంగా ముందే చెప్పారు. జనం బాటలో, శాసనమండలిలో ఆమె బీఆర్ఎస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ నాయకులు కూడా ఆమెకు అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. 

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత కొత్త పార్టీ పెట్టాలా వద్దా?అని సందిగ్ధంలో ఉన్న ఆమె, బీఆర్ఎస్‌ పార్టీతో జరిగిన ఈ యుద్ధాల తర్వాత పార్టీ పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ దిశలో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. 

కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో ఆమె ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యి సుదీర్గంగా చర్చించినట్లు సమాచారం. దేశంలో అనేక పార్టీలకు ఆయన ఎన్నికల నిపుణుడుగా పనిచేశారు. వాటిలో కాంగ్రెస్‌, బిజేపి, ఏపీలో వైసీపీతో సహా పలు పార్టీలను గెలిపించారు. కానీ తన సొంత రాష్ట్రం బిహార్‌లో సొంత పార్టీ పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు.

కనుక అయన గెలుపులు, ఈ దారుణ ఓటమి అనుభవం కూడా తమకు పనికివస్తుందని కల్వకుంట్ల కవిత భావించి ఉండవచ్చు. అందుకే ఆయనతో సమావేశం అయ్యుండవచ్చు. కానీ ఆయనతో కల్వకుంట్ల కవిత సమావేశమైనట్లు తెలంగాణ జాగృతి ఇంకా ధ్రువీకరించలేదు. 


Related Post