బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో సీనియర్ బిజేపి నాయకుడు నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఈరోజు ఆయన మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీల సమక్షంలో బిజేపి జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. వారందరూ అయనకు అభినందనలు తెలియజేయగా, తనకీ గొప్ప అవకాశం ఇచ్చి గౌరవించినందుకు ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు.
నితిన్ నబీన్ ఝార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా బిజేపిలోనే ఉండేవారు. బిహార్ రాష్ట్రంలో బంకీపూర్ నుంచి వరుసగా 4 సార్లు, ఒకసారి పాట్నా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతకు ముందు బిహార్ బిజేపి ఇన్-ఛార్జీగా వ్యవహరించారు. చత్తీస్ ఘడ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో బిజేపి గెలుపులో కీలకపాత్ర పోషించారు.