న్యాయవాదులతో వచ్చి ఒంటరిగా లోనికి...

January 20, 2026


img

మాజీ మంత్రి హరీష్‌ రావు ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నేడు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు న్యాయవాదులను వెంటబెట్టుకువచ్చారు. కానీ పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు. దీంతో హరీష్‌ రావు ఒక్కరే సిట్ కార్యాలయంలోకి వెళ్ళారు. ప్రస్తుతం సిట్ అధికారులు ఆయనని ప్రశ్నిస్తున్నారు. 

దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణలో బీఆర్ఎస్‌ పార్టీలో నోటీస్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి హరీష్‌ రావే. పార్టీకి మూలస్థంభం వంటి ఆయనకు నోటీస్ ఇవ్వడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతూ అక్కడికి చేరుకుంటున్నారు. కానీ ఇది ముందే ఊహించి జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళే దారులలో భారీగా పోలీసులు మొహరించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్నారు.

విచారణ ముగిసి అయన బయటకు వచ్చి ఏం మాట్లాడుతారోనని మీడియా ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌ బయట ఎదురుచూస్తున్నారు. 



Related Post