మన ప్రసాదుగారికి కలెక్షన్లు.. ప్రభుత్వానికి మొట్టికాయలు!

January 20, 2026


img


అనిల్ రావిపూడి దర్శకత్వం చిరంజీవి, నయనతార జంటగా చేసిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ అవడంతో మొదటి వారంలోనే సుమారు రూ.300 కోట్లు కలెక్షన్స్‌ వసూలు చేసింది. కానీ ఈ నెల 12న ఈ సినిమా విడుదలవుతున్నప్పుడు టికెట్ పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసినందుకు తెలంగాణ హోంశాఖ ప్రధాన కార్యదర్శిపై సుమోటోగా కోర్టు ధిక్కారం కేసు నమోదు చేసింది. అంటే బాసుకు కనకవర్షం... ప్రభుత్వానికి హైకోర్టులో మొట్టికాయలన్న మాట! 

నిజానికి ఈ నెల 9వ తేదీనే విజయ్‌ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ సంక్రాంతి సెలవులు రావడంతో ఈ కేసుపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. 

మారుతి-ప్రభాస్‌ సినిమా ‘రాజాసాబ్’కు టికెట్ ధరలు పెంచినప్పుడే మన ప్రసాద్ గారి కోసం జీవో జారీ చేశారని, కానీ ఈ సంబంధిత అధికారులు ఈ విషయం దాచిపెట్టారని విజయ్‌ గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. లేకుంటే మన ప్రసాద్ గారు సినిమాకి కూడా టికెట్ రెట్లు పెంచనీయకుండా ఉత్తర్వులు జారీ చేసి ఉండేదని వాదించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు హోంశాఖ ప్రధాన కార్యదర్శిపై సుమోటోగా కోర్టుధిక్కారం కేసు నమోదు చేసింది. అంతేకాదు... ఇకపై ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించాలని ప్రభుత్వం అనుకుంటే మూడు నెలల ముందుగా జీవో జారీ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జరీ చేసింది. మన ప్రసాద్ గారి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడడం అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయ్‌ గోపాల్ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.      



Related Post

సినిమా స‌మీక్ష