అవన్నీ కట్టు కధలే: భట్టి విక్రమార్క

January 18, 2026


img

ఇటీవల ఎన్టీటీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులని అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు పుట్టాయి. అయితే వారి అరెస్టుల వెనుక చాలా పెద్ద కధ నడిచిందంటూ ఏబీఎన్ న్యూస్ ఛానల్‌ మరో కధనం ప్రసారం చేసింది. ఆ సంస్థ అధిపతి వేమూరి రాధాకృష్ణ పేరిట నేడు ఆ న్యూస్ ఛానల్లో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్‌ బై ఆర్కే’లో సంచలన విషయాలు బయటపెట్టారు.

 సింగరేణికి చెందిన రూ.1600 కోట్ల విలువగల నైనీ బొగ్గు గనులను దక్కించుకోవడానికి డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి పోటీ పడ్డారని దానిలో పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బరిలో నుంచి తప్పించేందుకే ఎన్టీవీలో రాసలీలలు కధనం ప్రసారం అయ్యిందని, అదే  జర్నలిస్టుల అరెస్టుల వరకు వెళ్ళిందని ఏబీఎన్ న్యూస్ ఛానల్‌ పేర్కొంది. 

ఏబీఎన్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన  ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు: https://www.andhrajyothy.com/2026/editorial/naini-coal-block-controversy-media-politics-and-the-ethics-of-journalism-1485776.html   

ఏబీఎన్ న్యూస్ ఛానల్లో వచ్చిన ఈ కధనంపై డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ ఖండించారు. తాను తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలనే రాజకీయాలలోకి వచ్చానన్నారు. పదవీ అధికారం అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించాలని తాను ఎన్నడూ ఆరాటపడలేదన్నారు.

ఏబీఎన్ న్యూస్ ఛానల్‌ ఈ కట్టుకధ అల్లి తనపై బురద జల్లుతోందన్నారు. త్వరలో పూర్తి వివరాలతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతానని భట్టి విక్రమార్క అన్నారు.


Related Post