మరికొద్ది సేపట్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్ షురూ

December 13, 2025
img

 ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల ఆరాధ్య దైవం, గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని ముద్దుగా పిలుచుకునే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌ చేరుకున్నారు. అధికారులు, అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెస్సీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఫలక్‌నూమా నూమా ప్యాలస్‌ చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఎంపిక చేసిన వందమందితో మెస్సీ కరచాలనం చేసి ఫోటోలు దిగారు. అక్కడి నుంచి 6.30 గంటలకు బయలుదేరి ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు. 

మరికొద్ది సేపటిలో మెస్సీ-గోట్ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌లో సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. కనుక ఉప్పల్ స్టేడియం లోపల, బయట మూడు వేలమంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

రాత్రి 7.50 గంటలకు మెస్సీ-గోట్‌  ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. తర్వాత 8.06 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరూ ఒకేసారి మైదానంలోకి వస్తారు. తర్వాత 9 గంటలకు ఫుట్‌బాల్‌ క్రీడాకారులు రోడ్రిగో, లూయిస్ సువారేజ్ బరిలో దిగుతారు. రాత్రి 8.13 గంటలకు పెనాల్టీ షూటవుట్ ఉంటుంది. ఆ తర్వాత 8.18 గంటలకి రాహుల్ గాంధీ కూడా మైదానంలో దిగి సరదాగా కాసేపు ఆడతారు.   


Related Post