కేసీఆర్‌జీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా? సీతక్క

March 12, 2026


img

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుని మూసివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు వేశారు. 

నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని మొసలి కన్నీళ్లు కార్చుతున్న మీకు ఆనాడు మా పార్టీ, టీడీపి ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు గుర్తురాలేదా? మీ పార్టీలో చేరిన మా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మేము కోరితే మీరేం చేశారు. తలసాని, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా? అప్పుడు గుర్తుకురాని ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది.

అప్పుడు చేయకూడని తప్పులన్నీ చేశామని గుర్తులేనట్లు స్పీకర్‌, గవర్నర్‌, హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కనీసం అప్పుడైనా మీకు చేసిన తప్పులు గుర్తురాలేదా?” అంటూ ఎద్దేవా చేశారు. 


Related Post