పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌసులో డ్రగ్స్ పార్టీ.. అరెస్ట్!

March 15, 2026


img

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌసులో శనివారం రాత్రి డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న ఈగల్ టీమ్‌ దాడి చేసింది. వారు ఫామ్‌హౌసు చుట్టుముట్టినప్పుడు పార్టీలో ఉన్న ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపి ఈగల్ టీమ్‌ని వెనక్కు వెళ్ళిపోవాలని హెచ్చరించాడు. కానీ ఈగల్ టీమ్‌ అందరినీ అదుపులోకి తీసుకొని అక్కడే డ్రగ్ టెస్ట్ నిర్వహించింది. 

ఆ టెస్టులో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినవారిలో పైలట్ రోహిత్ రెడ్డితో సహా మరో ముగ్గురున్నారు.  పార్టీలో ఏపీకి చెందిన ఓ టీడీపి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, తెలంగాణకు చెందిన కొందరు నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని ఈగల్ టీమ్‌ అధికారులు చెప్పారు. 

పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేసి, డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినవారి శాంపిల్స్ హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు. వారి నుంచి తుపాకీ, మాదక ద్రవ్యాలు ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 


Related Post