దుబాయ్‌పై ఇరాన్‌ డ్రోన్ దాడి

March 13, 2026
img

అమెరికా యుద్ధానికి గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా దుబాయ్ భారీగా మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇరాన్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దేశాలపై ఒత్తిడి పెంచి వెనక్కు తగ్గేలా చేసేందుకు దాని స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించిన గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.

ఇప్పటికే దుబాయ్ మీద పలుమార్లు దాడులు చేసిన ఇరాన్‌ మళ్ళీ ఈరోజు మరోసారి దాడి చేసింది. ఈసారి దుబాయ్ ఆర్ధిక కేంద్రంపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిని దుబాయ్ ప్రభుత్వం ధృవీకరించింది. కానీ డ్రోన్‌ని కూల్చివేస్తే అది బహుళ అంతస్తుల భవనంపై కూలిపోయిందని, దీంతో ఆస్తి నష్టమే తప్ప ప్రాణ నష్టం జరగలేదని సర్ది చెప్పుకుంది.

ఇరాన్‌ తమ చుట్టూ ఉన్న దుబాయ్, అబుదాబీ, సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఖత్తార్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో ఆ దేశాలు ఇటు తమపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్‌ మీద, తమ అనుమతి, ప్రమేయం లేకుండా ఈ యుద్ధంలోకి లాగినందుకు అటు అమెరికాపై గుర్రుగా ఉన్నాయి. కానీ ఈ యుద్ధం పూర్తిగా ఆగే వరకు ఎవరూ ఏమీ చేయలేరు.

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="ar" dir="rtl">🚨🚨<br>دبي .. اندلاع النيران في أحد أبراج منطقة كريك هاربور عقب استهدافها بطائرة مسيّرة <a href="https://t.co/sW9S6iEQ3E">pic.twitter.com/sW9S6iEQ3E</a></p>&mdash; حمود أبو مسمار (@ThayirAljanub) <a href="https://twitter.com/ThayirAljanub/status/2032176142543642647?ref_src=twsrc%5Etfw">March 12, 2026</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Related Post