ఈరోజు (ఆదివారం) రాత్రి 8 గంటలకు దుబాయ్‌లో భారత్-పాక్ మద్య ఆసియా కప్-2025 మ్యాచ్ జరుగబోతోంది. ఈ ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్-పాక్ మద్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ “రక్తం-నీళ్ళు కలిసి ప్రవహించవు. ఆ దేశానికి సింధూ జలాలు వదిలే ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేశారు. కానీ నాలుగు నెలలు గడిచేసరికి ఆ భీకర శపధాలు అన్నీ మారిచిపోయి పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్‌కి భారత్ జట్టును పంపిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలు పాకిస్థాన్‌తో ఈ మ్యాచ్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాకు జరిగిన అన్యాయానికి ఆపరేషన్ సింధూర్‌తో ప్రతీకారం తీర్చారని సంతోషించాము. కానీ ఇప్పుడు అదే పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు బీసీసీఐపై నిప్పులు చెరుగుతున్నారు. కనుక ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది కనుక ఆఖరి నిమిషం వరకు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.