హైదరాబాద్ గోల్కొండ వద్ద గోల్ఫ్ క్లబ్ వద్ద శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు హాట్ ఎయిర్ బలూన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజున అంతా సవ్యంగా, హుషారుగా సాగినప్పటికీ నేడు రెండో రోజున ఓ హాట్ ఎయిర్ బలూన్ గాలిలో విహరిస్తుండగా ఎయిర్ బ్లోవర్ యంత్రంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో క్రమంగా గాలి తగ్గిపోయింది.
దీంతో దాని నిర్వాహకులు చాలా చాకచక్యంగా ఇబ్రహీంబాగ్ చెరువు వద్ద భద్రంగా కిందకు దించేశారు. వారితో పాటు దానిలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
అయితే హాట్ ఎయిర్ బలూన్ దిగిన ప్రదేశంలో కాస్త బురద ఉండటంతో అందరూ కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ స్థానికులు వచ్చి వారికి సాయపడ్డారు.
దాని నిర్వాహకులు ఎయిర్ బ్లోవర్‌కి మరమత్తు చేసుకొని మళ్ళీ దానిలోనే ప్రయాణిస్తూ గోల్కొండ గోల్ఫ్ క్లబ్ వద్ద క్షేమంగా దిగారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, హాట్ ఎయిర్ బలూన్లలో ఇటువంటి చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమేనని కానీ తాము అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఎటువంటి ప్రమాదం జరుగకుండా క్షేమంగా నేలపై దిగామని దాని నిర్వాహకులు చెప్పారు.

తప్పిన ప్రమాదం.. హాట్ ఎయిర్ బెలూన్‌లో సాంకేతిక సమస్య

హైదరాబాద్ - ఇబ్రహీంబాగ్ చెరువు దగ్గర అత్యవసర ల్యాండింగ్

సాంకేతిక లోపంతో గాలి తగ్గడంతో బురదలో దిగిన బెలూన్

అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో తప్పిన ప్రమాదం pic.twitter.com/cO2tWLXffM
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026

(Video Courtesy: Telugu Scribe)