ఐపీఎల్ విన్నర్ ఆర్‌సీబీ.. కల నెరవేరింది

June 04, 2025
img

భారత్‌లో ఐపీఎల్ మ్యాచులు మొదలైనప్పటి నుంచి ట్రోఫీ గెలుచుకోవడానికి రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇంతవరకు సాధించలేకపోయింది. ఎట్టకేలకు 18 ఏళ్ళ తర్వాత తొలిసారిగా ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆర్‌సీబీ ట్రోఫీ గెలుచుకొని ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఆ టీమ్‌ సభ్యులు, ముఖ్యంగా కర్ణాటకలో క్రికెట్‌ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. 

ఇంతవరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ చెరో 5సార్లు విజయం సాధించగా, మూడేళ్ళ క్రితం ఐపీఎల్లో ప్రవేశించిన గుజరాత్ టైటాన్స్ కూడా కప్పు గెలుచుకుంది. ఐపీఎల్లో అత్యంత పటిష్టమైన అద్భుతమైన జట్టుగా గుర్తింపు పొందిన ఆర్‌సీబీ మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కప్ గెలుచుకోలేకపోవడం అభిమానులను చాలా నిరాశపరిచింది. నిన్నటితో ముగిసిన ఐపీఎల్ సీజన్ 18లో పంజాబ్‌ కింగ్స్ జట్టుపై ఆరు పరుగులతో ఆర్‌సీబీ విజయం సాధించి తొలిసారిగా ఐపీఎల్ విజేతగా నిలిచింది. 

ముఖ్యంగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపధ్యంలో ఐపీఎల్ ట్రోఫీ సాధించకుండానే కెరీర్‌ ముగిస్తే వ్యక్తిగతంగా ఆయనకీ, అభిమానులకు చాలా నిరాశ కలిగించి ఉండేది. కానీ భారీ విజయంతో చాలా గౌరవంగా కెరీర్‌ ముగిస్తుండటం చాలా సంతోషకరమైన విషయమే. 


Related Post