కాటేదాన్‌ గ్లాస్ ఫ్యాక్టరీలో ప్రమాదం..

October 29, 2026
img

కాటేదాన్‌ పారిశ్రామికవాడలో గాజు సీసాలు తయారుచేసే పరిశ్రమలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. తాజా సమాచారం ప్రకారం కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక రసాయనం లీక్ అవడంతో పేలుడు సంభవించింది.

ఆ సమయంలో యంత్రాల వద్ద పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, సాయి అనే మరొక కార్మికుడికి ముఖంపై రసాయనం పడి తీవ్ర గాయాలయ్యాయి.

అలాగే ఒక పాదం సగం వరకు తెగిపోయినట్లు సమాచారం. వెంటనే తోటి కార్మికులు ఇద్దరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన సాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనిని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రెండో వ్యక్తికి ప్రాధమిక చికిత్స చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Post