జనగామలో స్కూటీపైనే ప్రాణాలు విడిచిన మెకానిక్

October 29, 2026
img

జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన బోడ లింగం (49) బోరు మోటర్ల మెకానిక్. బుధవారం జనగామ పట్టణానికి వెళ్ళి అక్కడ ఓ కొత్త మోటార్, దానిని బిగించడానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటు వచ్చింది. 

స్కూటీని పక్కకు తీసి దానిపైనే ఒరిగిపోయాడు. అది చూసి ఆ దారిన పోతున్నవారు అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వారి కళ్ళ ముందే అతను తుదిశ్వాస విడిచాడు. 

బోడ లింగంకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని అంబులెన్సులో స్వగ్రామానికి తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టణానికి వెళ్ళిన లింగయ్య నిర్జీవంగా తిరిగి రావడంతో భార్యా పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, స్థానికులు కంట తడిపెట్టారు.

Related Post