టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్

September 29, 2026
img

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్‌లో 102 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 నుంచి నవంబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు వయోపరిమితి: 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో నిర్దేశించిన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలి.

Related Post