నెట్‌ఫ్లిక్స్‌లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’

October 28, 2026


img

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్ ప్రధాన పాత్రలు చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. కానీ మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడీ సినిమా అక్టోబర్‌ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.  

క్లుప్తంగా ఈ సినిమా కథ సూరి (ఫహాద్ ఫాజిల్) హైదరాబాద్‌లో అంబులెన్స్ నడుపుతూ జీవిస్తుంటాడు. కానీ సులువుగా డబ్బు సంపాదించేందుకు దారులు వెతుకుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో పాతబస్తీలోని అస్లాం భాయ్ (మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్‌తో చిక్కుకుంటాడు. 

ఆ గ్యాంగ్‌కు 25 లక్షలు చెల్లించేందుకు సంపన్న కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుడిని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. కానీ ఓ చిన్నారి దివ్య (సారా పాలేకర్) అతని వద్దకే వచ్చి తన తల్లితండ్రులను తానే మాయం చేశానని, వాళ్ళ దగ్గరకు తనని తీసుకువెళ్ళాలని సాయం కోరడంతో తన పని సులువైందని సూరి సంతోషపడతాడు. కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అది ఏమిటనేది నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే బాగుంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష