రెండేళ్ల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్య

October 27, 2026
img

హైదరాబాద్‌, కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దంపతులు తమ రెండేళ్ళ చిన్నారి స్నిగ్ధను ముందుగా చంపేసి, తర్వాత ఇద్దరూ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

వారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపీ, సమత దంపతులుగా పోలీసులు గుర్తించారు. తీవ్ర ఆర్ధిక సమస్యలు, అప్పుల బాధ, కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం లేకపోవడంతో వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నామని చనిపోయే ముందు ఇంటి గోడపై వ్రాసినట్లు తెలుస్తోంది. తమ మరణాలకు ఎవరూ కారణం కాదని, తమకు మరో మార్గం కనిపించ లేక పోవడంతో ఇద్దరం బాగా ఆలోచించే ఈ ఈ నిర్ణయం తీసుకున్నామని గోడ మీద వ్రాశారు. తమకు అప్పులు ఇచ్చినవారి బకాయిలు తీర్చకుండా చనిపోతున్నందుకు తమను క్షమించాలని వ్రాసినట్లు తెలుస్తోంది. 

క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Related Post