జాసన్ సంజయ్ హీరోగా కొత్త సినిమాకి అట్లీ!

October 29, 2026


img

తమిళనాడు సిఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ‘సిగ్మా’తో దర్శకుడిగా పనికిరానని అనుకున్నారో ఏమో.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

తాజా ప్రచారం ప్రకారం, అతని తండ్రి విజయ్‌కు ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి మూడు సూపర్ హిట్స్ అందించి వాటితో ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు అట్లీతో ఈ కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాకు అట్లీ దర్శకుడుగా కాక నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. 

అట్లీ సొంత బ్యానర్‌ ‘ఏ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్’ పై ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ కిడ్ సినిమాకు ‘డూడ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం అయన శింబుతో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో అది పూర్తవగానే జాసన్ సంజయ్ హీరోగా సినిమా ప్రారంభిస్తారు. సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన లాంచన ప్రాయమేనని భావించవచ్చు. 


Related Post

సినిమా స‌మీక్ష