బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నవంబర్ 1న రైతు గర్జన సభ నిర్వహించబోతోంది. ఆరోజు సాయంత్రం 5 గంటలకు డైట్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే ఈ సభకు వేలాదిగా రైతులు తరలిరావాలంటూ బీఆర్ఎస్ పార్టీ ‘ఛలో ఆదిలాబాద్’ పిలుపునిచ్చింది.
కృష్ణ, గోదావరి నీళ్ళను ఎత్తిపోసుకోవడంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరూ బలంగా తమ వాదనలు వినిపిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్‌లో జరుగబోయే రైతు గర్జన సభతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించబోతోంది. ఈ సభకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేసి ఈ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ హాజరవుతారా లేదా?అనే విషయం ఇంకా ప్రకటించలేదు. కానీ ఆయన సూచన మేరకే ఈ సభ జరుగుతోందని భావించవచ్చు. కనుక అయన ఈ సభకు హాజరయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం కలుగుతుంది.
ఇక ఈ సభతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కనుక నీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు? రిజర్వాయర్లు ఎందుకు నింపడం లేదు?వ్యవసాయానికి నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? అనే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పని పరిస్థితి కలుగుతుంది.
ఛలో ఆదిలాబాద్ ✊🏻
తెలంగాణ రైతాంగానికి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయంపై బీఆర్ఎస్ సమరశంఖం!
✨ వేలాదిగా తరలివెళ్దాం..
💪 రైతు గర్జన సభను విజయవంతం చేద్దాం!
🗓️ నవంబర్ 1, 2026
⏰ సాయంత్రం 5 గంటలకు
📍 డైట్ కాలేజ్ గ్రౌండ్, ఆదిలాబాద్ https://t.co/UCimzHD5TF