రెండు రాష్ట్రాలలో సర్ గడువు పొడిగింపు

October 30, 2026


img

కేంద్ర ఎన్నికల కమీషన్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువు పొడిగించింది. రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారుల విజ్ఞప్తుల మేరకు గురువారం సవరించిన షెడ్యూల్‌ ప్రకటించింది. 

కొత్త షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రక్రియకు సంబంధించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి నవంబర్ 20 వరకు గడువు ఇచ్చారు. తెలంగాణలో నవంబర్ 26 వరకు ఈ గడువు పొడిగించారు.

రెండు రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాలను నవంబర్ 30న విడుదల చేస్తారు. కనుక ఆలోగా ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ఓటర్లు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జాబితాలో పేర్లు లేకపోయినా, వ్యక్తిగత వివరాల్లో తప్పులున్నా లేదా ఏదైనా విషయంపై అభ్యంతరాలు తెలియజేయాల్సి ఉన్నా నిర్ణీత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలి.



Related Post