తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి చిరంజీవి పరిచితుడే. విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ అయన చేస్తున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే పూరీ జగన్నాథ్ తన టెంపుల్ టౌన్ స్ట్రీట్ నంబర్ సినిమాకు విజయ్ సేతుపతిని హీరోగా తీసుకున్నారు.
కోలీవుడ్ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం విజయ్ సేతుపతి చేస్తున్న చిత్రం పేరు ‘పాకెట్ నావెల్’. మొదట ఈ సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ అయన తప్పుకోవడంతో జి.వి.ప్రకాశ్ కుమార్‌కు ఆ బాధ్యత అప్పగించారు. అయన ఈ టీమ్‌లో జాయిన్ అయినట్లు తెలియజేస్తూ ఓ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈవిషయం బయట పెట్టడం విశేషం.
‘పాకెట్ నావెల్’లో విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి, కిషోర్ ప్రధాన పాత్రలు చేశారు.
టీడీకేఎఫ్ బ్యానర్‌పై దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా నిర్మాతగా పాకెట్ నవల్ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.