ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ‘యల్లమ్మ’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ త్వరలో విడుదల కాబోతోంది. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వంద మంది జానపద కళాకారులతో దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట రికార్డింగ్ చేశారని చిత్ర బృందం తెలియజేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసింది.
హాస్య నటుడుగా చిన్న చిన్న పాత్రలతో కాలక్షేపం చేసే వేణు ఎల్దండి, హటాత్తుగా దర్శకుడుగా మారి తొలి సినిమా ‘బలగం’తో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు తన రెండో సినిమా ‘యల్లమ్మ’ను 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. కనుక ‘యల్లమ్మ’ విడుదలకు ఏమాత్రం తొందర పడటం లేదు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గ్రామీణ యువకుడు ‘పర్షి’గా నటిస్తున్నారు. అతనికి జోడీగా అనంతిక సనిల్ కుమార్ (మ్యాడ్, 8 వసంతాలు) నటిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, భాగ్యశ్రీ బోర్సే కీలకపాత్రలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వేణు ఎల్దండి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మురళి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ‘యల్లమ్మ’ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.
Rockstar 🌟 @ThisIsDSP records the #Yellamma title song with 100 folk rhythm artists representing diverse cultures across India! 🔥🥁
FIRST SINGLE SOON ❤️🔥❤️🔥
In Cinemas #YellammaFromMarch5th 💥
@VenuYeldandi9 #DilRaju #Shirish @HR_3555 @muraligdop @Hr_3555 #HanshithaReddy @svc_official @Tseries @tseriessouth