అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో కామ్రేడ్ కళ్యాణ్

October 30, 2026


img

శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనతో ఒడ్డున పడింది. ఇప్పుడీ సినిమా నేడు (శుక్రవారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం అవుతోంది. 

  జానకీ రామ్‌ మారెళ్ళ దర్శకత్వంలో వచ్చిన ‘కామ్రేడ్ కళ్యాణ్’లో శ్రీవిష్ణు మావోయిస్టుగా నటించగా, రాధికా శరత్ కుమార్‌, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి కామ్రేడ్ కళ్యాణ్ నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష