రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కమ్మెట గ్రామ సమీపంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌పై చేవెళ్ల పోలీసులు.. స్పెషల్ ఆపరేషన్ టీమ్‌తో కలిసి శుక్రవారం అర్ధరాత్రి దాడి చేశారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు మద్యం తాగుతూ చిందులు వేస్తున్నప్పుడు హటాత్తుగా పోలీసులు ప్రవేశించారు.
వారిని చూసి ఆ యువతీయువకులు అక్కడి నుంచి తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. కొందరు పెరటి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ ఇది ముందే ఊహించి అక్కడ కాపు కాసిన పోలీసులు వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న మందు పార్టీలో మొత్తం 108 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారందరికీ అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ముగ్గురు గంజాయి సేవించినట్లు కనుగొన్నారు.
అక్కడ డజన్ల కొద్దీ తెచ్చిపెట్టుకున్న బీర్, మద్యం బాటిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వివరాలు నమోదు చేసుకున్నాక అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ ఫామ్‌హౌసు ఎవరిది? ఎవరు దానిని బుక్ చేశారు?ఈ మద్యం పార్టీని ఎవరు, ఎందుకు ఏర్పాటు చేశారు? మద్యం మాత్రమేనా నిషేదిత మాదక ద్రవ్యాలు కూడా రప్పించారా? వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.